హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ప్రాంతంలో రాత్రి వేళల్లో అనుమతించిన డెసిబుల్ పరిమితి మించి లౌడ్ స్పీకర్లు మోగుతున్నాయని నటుడు అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినోభానగర్ హనుమాన్ ఆలయం నుంచి అర్ధరాత్రి 2-3 గంటల వరకు శబ్దం వస్తోందని, వృద్ధులు, పిల్లలు, ఉద్యోగులు నిద్రలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. గతంలో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి మైకుల శబ్దంపై అల్లు శిరీష్ పోలీసులకు ఫిర్యాదు
Source: Chitrajyothy