భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 43 అడుగుల నుంచి 41 అడుగులకు తగ్గి ప్రమాద హెచ్చరిక స్థాయి కంటే దిగువకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గడంతో వరద ప్రవాహం గణనీయంగా తగ్గింది. దీంతో భద్రాచలం పట్టణం, చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయినా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం
Source: Vaartha