తెలంగాణలో బిసి, ఇతర వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే రాజీవ్ యువ వికాసం పథకం వచ్చే నవంబర్ నుంచి అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారులకు గరిష్ఠంగా రూ. 3 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది.
నవంబర్ నుంచి రాజీవ్ యువ వికాసం: భట్టి విక్రమార్క
Source: Vaartha