మహిళల భద్రతకు సంబంధించిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఒలా, ఉబర్, రాపిడో రైడ్-హెయిలింగ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తేజస్ కారియాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. యాప్‌లో కనిపించే డ్రైవర్, వాహన వివరాలు వాస్తవంగా వచ్చే వాటితో సరిపోలేలా కఠిన ధ్రువీకరణ వ్యవస్థ, 24 గంటల కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు.
మహిళల భద్రతపై ఒలా, ఉబర్, రాపిడోకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
Source: Vaartha