లిఫ్ట్‌లో బరువు పరిమితి దాటకూడదు, డోర్లు సరిగ్గా మూయాలి, బటన్లను గుద్దకూడదు. తడి చేతులతో బటన్లు నొక్కడం, నీరు లిఫ్ట్ ట్రాక్‌లోకి వెళ్లడం వల్ల షార్ట్ సర్క్యూట్ ప్రమాదం. పిల్లలను ఒంటరిగా పంపకూడదు, లిఫ్ట్‌లో ఎగరడం, డ్యాన్స్ చేయడం వల్ల బ్రేకింగ్ సెన్సార్లు యాక్టివేట్ అయి లిఫ్ట్ మధ్యలో లాక్ అవుతుంది. నెలకు ఒకసారి నిపుణులతో మెయింటెనెన్స్, డోర్ ట్రాక్ శుభ్రత, ARD బ్యాటరీ చెకప్ చేయించాలి.
లిఫ్ట్ పాడవకుండా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు
Source: Webdunia Telugu