జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించగానే చాలామంది సొంత వైద్యం చేసుకుంటూ డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తప్పు మందు, తప్పు మోతాదు, అకాలంగా మందు ఆపేయడం వంటి పొరపాట్లు జరిగి, యాంటీబయాటిక్ నిరోధకత పెరగవచ్చు. వైద్యుడు సూచించినప్పుడే సరైన మోతాదులో, పూర్తి వ్యవధి వరకు యాంటీబయాటిక్స్ తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైద్యుడి సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వద్దు
Source: Vaartha