తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ వారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబర్ 4 నుంచి 6 వరకు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రధానంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక.. ఐఎండీ అలర్ట్
Source: Asianet Telugu