పాకిస్థాన్ తన అంతరిక్ష రంగాన్ని విస్తరించే దిశగా చైనా సహకారంతో కీలక అడుగు వేస్తోంది. చైనాకు చెందిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం వేదికగా బయోటెక్నాలజీ ప్రయోగాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. సొంత మానవ సహిత వ్యోమనౌక మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాకిస్థాన్ పూర్తిగా చైనా సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడుతోంది. ఇద్దరు పాకిస్థానీ వ్యోమగాములు చైనాలో శిక్షణ పొందుతున్నారు; వీరిలో ఒకరిని చైనా వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు.
చైనా సహకారంతో పాకిస్థాన్ అంతరిక్ష ప్రయోగం
Source: Vaartha