'కుకూన్స్' చిత్రానికి సంబంధించిన సరికొత్త ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి అధికారికంగా విడుదల చేశారు. జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహేశ్ గౌరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని న్యూ వేవ్ పిక్చర్స్, ఎం.ఆర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి నిర్మిస్తున్నారు. పోస్టర్‌ను ప్రశంసించిన అనిల్ రావిపూడి, వినూత్న కాన్సెప్ట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.
అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'కుకూన్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Source: Chitrajyothy