త్రిగుణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'జంగా' చిత్రం నుంచి నటుడు మధునందన్ క్యారెక్టర్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మధునందన్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కెవిన్ గడ్డం దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నేహా పఠాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
జంగా నుంచి మధునందన్ పోలీస్ లుక్ పోస్టర్ విడుదల
Source: Chitrajyothy