తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ కూటమిలో సీపీఐ అసంతృప్తి బహిర్గతమైంది. మదురాంతకం-ధారాపురం ఉప ఎన్నికల్లో టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే డబ్బు పంపిణీ చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య హత్య అని ఆయన విమర్శించారు. ఇటీవల హిందుత్వ ప్రచారంపైనా సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విభేదాలతో కూటమి నుంచి సీపీఐ నిష్క్రమించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తమిళనాడు కూటమిలో సీపీఐ-టీవీకే విభేదాలు
Source: Gulte Telugu