వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. జగన్ తనను మళ్లీ పిలవరని, పిలిచినా వెళ్లనని స్పష్టం చేశారు. 2023లో ప్రధాని, కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లపై జగన్ వ్యాఖ్యలు, 2024లో సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించడం తనకు అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Source: Vaartha