రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాల లక్ష్యంగా 'మిషన్ మార్చ్' అమలు చేయాలని, డ్రాప్ అవుట్స్ నివారణకు 'జీరో డ్రాప్ అవుట్ మిషన్' చేపట్టాలని సూచించారు. 1,523 అధ్యాపక పోస్టుల భర్తీ, 175 లీప్ స్కూళ్లు, 125 ఆటిజం సెంటర్ల ఏర్పాటుపై చర్చించారు.
నెలలో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్: మంత్రి లోకేష్ ఆదేశం
Source: telugutimes.net