జార్జియాలోని ఫోర్సైత్ కౌంటీలో భారతీయ అమెరికన్ సమాజ ప్రతినిధులు విద్యా మండలి 5వ జిల్లా సభ్యుడు మైక్ వాల్డెస్‌తో సమావేశమై విద్యార్థుల భద్రత, సంక్షేమం, కృత్రిమ మేధ (AI), భాషా విద్య తదితర అంశాలపై చర్చించారు. పాఠశాల సౌకర్యాల వినియోగం, అద్దె ఖర్చులు, దరఖాస్తు విధానాలపై స్పష్టత అవసరమని నొక్కి చెప్పారు. వాల్డెస్ తిరిగి ఎన్నికకు మద్దతు తెలిపిన సభ్యులు, ఇటువంటి సంభాషణలు కొనసాగాలని ఆకాంక్షించారు.
ఫోర్సైత్ కౌంటీ విద్యా మండలి ప్రతినిధితో ఇండియన్-అమెరికన్ సభ్యుల సమావేశం
Source: telugutimes.net