తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం–నజరేత్ రహదారిపై కొత్త సైన్‌బోర్డులో తమిళం, ఇంగ్లిష్‌తో పాటు హిందీ పదాలు వాడటం కలకలం రేపింది. రాష్ట్ర ద్విభాషా విధానాన్ని ఉల్లంఘించినందుకు హైవేస్ శాఖకు చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. హిందీ పదాలను వెంటనే తొలగించారు; భవిష్యత్తులో ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
హిందీ సైన్‌బోర్డుపై ఇద్దరు ఇంజనీర్ల సస్పెన్షన్
Source: Vaartha