తెలంగాణలో సాగు భూముల్లో అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్ల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో వేలాది కుటుంబాలకు ఉపశమనం కలిగింది. కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు లేని అర్హత గల దరఖాస్తులను మాత్రమే పరిశీలించి పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. ఇళ్ల యజమానులు ఇబ్బందులు లేకుండా ఆస్తులను విక్రయించుకోవచ్చు, బ్యాంకు రుణాలు పొందవచ్చు.
సాగు భూముల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
Source: Vaartha