ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాటలో జాన్వీని అసభ్యంగా చూపుతూ ఏఐ మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేయడంపై విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది డిజిటల్ రూపంలో జరిగే లైంగిక దాడితో సమానమని, బాధ్యులను వదిలిపెట్టకూడదని, కఠినంగా శిక్షించాలని విజయ్ దేవరకొండ డిమాండ్ చేశారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు వస్తాయని కళ్యాణ్ రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏఐ మార్ఫింగ్‌పై విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్ ఆగ్రహం
Source: Chitrajyothy