శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'భోగి' టీజర్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో కమ్మరి గంగను భూస్వాములు అపహరించడంతో ఘర్షణ మొదలవుతుంది. తెలంగాణ యాసలో శర్వా డైలాగులు, అనుపమ పరమేశ్వరన్, దింపుల్ హయాతి పాత్రలు ఆకట్టుకుంటున్నాయి. కిషోర్ కుమార్ ఛాయాగ్రహణం, భీమ్స్ సెసిరోలియో సంగీతం టీజర్‌కు బలం చేకూర్చాయి.
భోగి టీజర్: శర్వా మాస్ అవతార్‌లో రక్తపు యుద్ధం
Source: Gulte Telugu