విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులు 9552300009 వాట్సాప్ నంబర్‌కు హాయ్ పంపి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా చెల్లించిన వెంటనే టికెట్ వివరాలు వాట్సాప్‌కు వస్తాయి. క్యూలైన్లు తప్పించి నిమిషాల్లో దర్శనం పొందవచ్చని అధికారులు తెలిపారు.
విజయవాడ దుర్గమ్మ దర్శన టికెట్లు వాట్సాప్‌లో బుకింగ్
Source: Vaartha