హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ ప్రాజెక్ట్ పనులను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతో సుమారు మూడు వేల చెట్లు కోల్పోవడంతో పాటు మూడు వందల కోట్ల ప్రజాధనం వృధా అయిందని నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ వ్యయం వెయ్యి కోట్లకు పైగా పెరగడం, టీడీఆర్ బాండ్లపై యజమానుల అనాసక్తి ప్రధాన కారణాలు. పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు ప్రత్యామ్నాయ ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన ఉన్నప్పటికీ వన్ వే విధానం కొనసాగుతుంది.
కేబీఆర్ పార్క్ ప్రాజెక్ట్ రద్దు, 3 వేల చెట్లు నష్టం
Source: Vaartha