ఆధార్ కార్డు సవరణల కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్త నిబంధనలు విడుదల చేసింది. సవరణలను ఐదు విభాగాలుగా విభజించారు. మొదటి విభాగంలో చిన్న అక్షర దోషాలు, రెండో విభాగంలో వివాహం లేదా విడాకుల తర్వాత మార్పులు, మూడో విభాగంలో డేటా ఎంట్రీ తప్పుల సరిదిద్దడం, నాలుగో విభాగంలో స్థానిక భాషలో పేరు మార్పు, ఐదో విభాగంలో పూర్తి పేరు మార్పుకు గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి. సమీప ఆధార్ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసి రూ.75 రుసుము చెల్లించాలి.
ఆధార్ సవరణలకు కొత్త నిబంధనలు.. ఐదు విభాగాలుగా విభజన
Source: Vaartha