తెలంగాణలో నవంబర్ నుంచి యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి 50 పైసల ట్రూ-అప్ ఛార్జీలు విధించాలని TGERC నిర్ణయించింది. డిస్కంల ఆర్థిక లోట్లు పూడ్చేందుకు రూ.7,635 కోట్లకు పైగా వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయానికి మినహాయింపు ఉన్నా, గృహ, పారిశ్రామిక వినియోగదారులపై భారం పడనుంది. ఈ నిర్ణయంపై విపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణలో విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీలపై రాజకీయ దుమారం
Source: telugutimes.net