సస్పెన్స్ థ్రిల్లర్ 'పర్ణశాల' ప్రచారంలో 'జిమ్ జిమ్ తార' పాట ప్రధాన ఆకర్షణగా మారింది. భారీ పెయిడ్ క్యాంపెయిన్లు, స్టార్ ప్రమోషన్లకు దూరంగా ఈ పాటను క్యాచీ హుక్‌గా మార్చుకుని టీమ్ ప్రచారాన్ని కొత్త దారిలో తీసుకెళ్లింది. లక్ష్మీదేవి పాడిన ఈ పాట సోషల్ మీడియాను దాటి సాధారణ ప్రేక్షకుల్లోనూ వినిపిస్తోంది. వై.జి. భరత్ దర్శకత్వంలో, మంచి వెంకట్ నిర్మాణంలో ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
పర్ణశాల ప్రమోషన్‌లో 'జిమ్ జిమ్ తార' పాట కీలకం
Source: Chitrajyothy