ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. బాలికల గురుకులాల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉద్యోగులను, ప్రిన్సిపాళ్లతో సహా, బాలుర విద్యాసంస్థలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఒకే సంస్థలో రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు; ఎనిమిదేళ్లు కొనసాగిన వారికి తప్పనిసరి బదిలీ. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతుంది.
బీసీ గురుకుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు
Source: Vaartha