సింగరేణి కార్మిక కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. పెండింగ్‌లో ఉన్న 300 డిపెండెంట్ ఉద్యోగాలను 15 రోజుల్లో భర్తీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. పేర్ల మార్పులకు సంబంధించి సుమారు 136 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెడికల్ బోర్డు సమావేశాలను ఏరియా ఆసుపత్రుల్లోనే నిర్వహించాలని, కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి వన్ టైమ్ ఆప్షన్ కల్పించాలని ఆయన సూచించారు.
సింగరేణి పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాల భర్తీకి ఆదేశం
Source: Vaartha