ఏపీలో వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా సవరణ పూర్తికాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆమోదాన్ని సవాలు చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి, ప్రక్రియలు పూర్తయ్యే వరకు ఎన్నికలను నిలిపివేయాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యగా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసి, తమ వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేయవద్దని అభ్యర్థించింది.
ఏపీ స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం
Source: Vaartha