దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. క్రూడ్ ఆయిల్ ధరలు మంటెత్తడం, వడ్డీ రేట్ల పెరుగుదల భయాలు, విదేశీ పెట్టుబడుల వెనక్కి తీసుకోవడంతో విక్రయాల ఒత్తిడి పెరిగింది. దీంతో సెన్సెక్స్ 1,045 పాయింట్లు, నిఫ్టీ 371 పాయింట్లు నష్టపోగా, ఇన్వెస్టర్లకు సుమారు రూ.11 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. రిలయన్స్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఇండిగో, పవర్ గ్రిడ్ షేర్లు భారీగా దెబ్బతిన్నాయి.
సెన్సెక్స్ 1,045 పాయింట్లు కుప్పకూలి రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి
Source: Vaartha