విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, అకాసా ఎయిర్ ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌లను పెంచాయి. దేశీయ విమానాలపై దూరాన్ని బట్టి రూ.400 నుంచి రూ.1,200 వరకు అదనపు ఛార్జీ విధించనున్నారు. అంతర్జాతీయ మార్గాల్లో పశ్చిమాసియాకు 55 డాలర్లు, ఉత్తర అమెరికాకు గరిష్ఠంగా 215 డాలర్ల వరకు సర్‌ఛార్జ్ ఉంటుంది. ఇప్పటికే ఇండిగో ఛార్జీలు పెంచిన నేపథ్యంలో పండుగ సీజన్‌లో ప్రయాణాలు భారమవుతాయి.
ఇంధన ధరల పెరుగుదల: ఎయిరిండియా, అకాసా ఎయిర్ ఛార్జీలు పెంపు
Source: Vaartha