ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లు తొలగింపు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని, సీబీఐ, ఈడీ వంటి సంస్థలను అస్త్రాలుగా మల్చుకుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఈసీ తీరుపై ప్రధాని మోదీ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
Source: Vaartha