అమెరికా, జాంబియా ప్రభుత్వాలు 2.49 బిలియన్ డాలర్ల ఆరోగ్య సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో అమెరికా 1.52 బిలియన్ డాలర్లు, జాంబియా 975 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. వైద్య నమూనాల మార్పిడిపై విభేదాలు తొలగించిన తర్వాత ఒప్పందం కుదిరింది. ఖనిజ సంపదతో ఈ ఒప్పందానికి సంబంధం లేదని జాంబియా స్పష్టం చేసింది.
జాంబియాతో అమెరికా 2.49 బిలియన్ డాలర్ల ఆరోగ్య ఒప్పందం
Source: Telugu Post