ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే నవజాత శిశువుల కోసం ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పథకం లాంఛనంగా అమల్లోకి రానుంది. ఒక్కో కిట్‌లో 14 రకాల వస్తువులు ఉండగా, దాని విలువ సుమారు రూ.1,400. మొత్తం రూ.51 కోట్లతో అమలు కానున్న ఈ పథకం తల్లిదండ్రులకు ఆర్థిక ఉపశమనంతో పాటు శిశు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో రూపొందింది.
ఎన్టీఆర్ బేబీ కిట్ పథకానికి ఆంధ్రప్రదేశ్ సన్నాహాలు
Source: Vaartha