హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణెకు ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్లకు ఇంకా ప్రాథమిక అలైన్‌మెంట్ అధ్యయనాలే జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలకు భూసేకరణ ఉత్తర్వులు పంపలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ దశలో భూసేకరణ చట్టవిరుద్ధమని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ భేటీ అనంతరం ప్రకటించారు. అలైన్‌మెంట్ ఖరారుకు ముందే భూసేకరణ ప్రయత్నాలు రైతుల ఆందోళనకు కారణమవుతున్నాయి.
హైస్పీడ్ రైలు భూసేకరణపై కేంద్రం కీలక స్పష్టత
Source: telugutimes.net