హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అలైన్‌మెంట్ అధ్యయనాలు మాత్రమే జరుగుతున్నాయని, భూసేకరణ అభ్యర్థనలు ఏవీ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపలేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ దశలో హైస్పీడ్ రైల్ పేరుతో జరిపే భూసేకరణ చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగిన భేటీలో హైదరాబాద్-చెన్నై, బెంగళూరు, పుణె కారిడార్ల పురోగతిపై చర్చించారు.
హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లపై కేంద్రం కీలక ప్రకటన
Source: Vaartha