డిజిటల్ చెల్లింపుల రంగంలో కొత్త విప్లవానికి తెరలేపుతూ రిలయన్స్ జియో ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ అద్దాలు ధరించి స్టోర్‌లోని క్యూఆర్ కోడ్ వైపు చూసి వాయిస్ కమాండ్ ఇస్తే సెకన్లలో లావాదేవీ పూర్తవుతుంది. భద్రత కోసం ఒక్క లావాదేవీకి గరిష్ఠంగా రూ.5,000, నెలవారీ పరిమితి రూ.15,000గా నిర్ణయించారు.
యూపీఐ చెల్లింపులకు జియో స్మార్ట్ గ్లాసెస్
Source: Vaartha