నీరు, డిటర్జెంట్లు అవసరం లేకుండా దుస్తులు ఉతికే వాషింగ్ మెషీన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. లిక్విడ్ కార్బన్ డయాక్సైడ్ సాంకేతికతతో పనిచేసే ఈ యంత్రాలు మురికి, నూనె మరకలను తొలగించి, ఉతికిన వెంటనే పొడి దుస్తులు ఇస్తాయి. సాధారణ మెషీన్ ఒక్కసారి ఉతకడానికే సుమారు 150 లీటర్ల నీరు వాడుతుండగా, వీటిని దేశవ్యాప్తంగా వాడితే ఏటా దాదాపు 10 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఆదా అవుతుందని అంచనా.
నీరు అక్కర్లేని వాషింగ్ మెషీన్లు: నీటి సంక్షోభానికి పరిష్కారం
Source: Asianet Telugu