అడవి తల్లి బాట 2.0 కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో జనసేన నేతలే మొదట రంగంలోకి దిగారని ఆయన అనడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి అమెరికా వరకు టీడీపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ముందు ఈ వ్యాఖ్యలు కూటమిలో అస్థిరతకు దారితీయవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి.
పవన్ వ్యాఖ్యలపై టీడీపీ క్యాడర్ అసంతృప్తి
Source: Gulte Telugu