ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. పైలట్లు అప్రమత్తమై విమానాన్ని హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ల్యాండింగ్ అనంతరం సిబ్బంది మంటలను అదుపు చేయగా, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం తెలిపింది. పవర్ బ్యాంక్ పేలడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ పేలి మంటలు.. హైదరాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
Source: Vaartha