ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటనపై కొందరు సినిమాల హింసను కారణంగా చూపుతుండటంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. నేరం జరిగినప్పుడు బాధితుల పట్ల సానుభూతి, సమస్య మూలాలను అర్థం చేసుకోవడమే మొదటి స్పందన కావాలని ఆయన అన్నారు. విమర్శకులు తమ వ్యక్తిగత కక్షల కోసం విషాదాన్ని సాకుగా వాడుతున్నారని ఆయన ఆరోపించారు.
సినిమాలను బలిపశువు చేయడం సరికాదు: సందీప్ రెడ్డి వంగా
Source: Chitrajyothy