మణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

మణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

టీజీఎస్‌ఆర్‌టీసీ మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రజలకు సేవలందిస్తున్న మహిళా ఉద్యోగిని కోల్పోవడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు, సహచర సిబ్బంది కూడా సంతాపం తెలిపారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies