APPSC గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఆరు చోట్ల, గుంటూరు జిల్లాలో ఒక చోట మొత్తం ఏడు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2020 గ్రూప్-1 మెయిన్స్ సమాధాన పత్రాలను అర్హత లేని 66 మందితో మూల్యాంకనం చేయించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరోపించింది. సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
APPSC గ్రూప్-1 కేసులో ఏడు చోట్ల ఈడీ సోదాలు
Source: Vaartha