భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,718.01 పాయింట్లు (2.17 శాతం) పెరిగి 81,028.02 వద్ద, నిఫ్టీ 493.75 పాయింట్లు (2.01 శాతం) లాభపడి 25,030.35 వద్ద స్థిరపడింది. ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోగా, మహీంద్రా అండ్ మహీంద్రా 6.15 శాతం లాభపడింది. ఎఫ్ఐఐల భారీ కొనుగోళ్లు, ముడిచమురు ధరల తగ్గుదల మార్కెట్ ర్యాలీకి బలం చేకూర్చాయి.
సెన్సెక్స్ 1,718 పాయింట్ల లాభంతో ముగింపు, నిఫ్టీ 25 వేలు దాటింది
Source: Vaartha