తెలంగాణలో వానాకాలం సీజన్‌లో 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంతో 8,224 కేంద్రాలు ఏర్పాటు చేసినా నెలరోజుల్లో కేవలం 48 వేల టన్నులే సేకరణ జరిగింది. బహిరంగ మార్కెట్‌లో సన్న ధాన్యానికి ఎక్కువ ధర లభిస్తుండటంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు కల్లాల దగ్గరే అమ్ముతున్నారు. దీంతో కొనుగోలు లక్ష్యం చేరుకోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెల.. రైతులు కల్లాల దగ్గరే అమ్మకం
Source: V6 News