కొడంగల్-నారాయణపేట-మక్తల్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అంచనా వ్యయం పెంచి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీకి లబ్ధి చేకూర్చారని ఆయన విమర్శించారు. టెండర్లలో ఆ కంపెనీయే ప్రధాన పోటీదారుగా ఉండగా, మిగతా సంస్థలు నామమాత్రంగానే పాల్గొన్నాయని పేర్కొన్నారు.
కొడంగల్ ఎత్తిపోతల టెండర్లలో అవకతవకలు: కేటీఆర్ ఆరోపణ
Source: Vaartha