గ్రామ పంచాయతీల సొంత ఆదాయానికి ఆర్థిక స్వేచ్ఛ

గ్రామ పంచాయతీల సొంత ఆదాయానికి ఆర్థిక స్వేచ్ఛ

తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. ఈ మేరకు సొంత ఆదాయాన్ని నేరుగా పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కొత్త విధానం అక్టోబర్ 9 నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో పారిశుద్ధ్యం, సిబ్బంది జీతభత్యాలు, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ వంటి స్థానిక అవసరాలకు నిధులను వేగంగా వినియోగించుకోవచ్చు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies