విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ రాజకీయ పట్టు సడలుతున్నట్లు కనిపిస్తోంది. బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో ఆయన కుమార్తె బొత్స అనుషకు టీడీపీ అభ్యర్థి పాశల నీరజ 5,136 ఓట్ల భారీ మెజారిటీతో ఓటమి చవిచూపించారు. ఇదే సమయంలో ఆయన అనుచరులు, మేనల్లుడు మజ్జి శ్రీనుతో సహా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం ఆయనకు మరో ఎదురుదెబ్బ.
విజయనగరంలో బొత్స హవా ముగింపు?
Source: Gulte Telugu