తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెరికా కాన్సులేట్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. హైదరాబాద్‌లో సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతితో వారు సమావేశమయ్యారు. ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నిరంతర విద్యుత్ అవసరం ఉన్న డేటా సెంటర్లకు సింగరేణి ప్రాంతాలు అనుకూలమని భావిస్తున్నారు. కీలక ఖనిజాల అన్వేషణ, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లపైనా చర్చ జరిగింది.
తెలంగాణలో డేటా సెంటర్లపై అమెరికా ఆసక్తి
Source: Asianet Telugu