స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్బీఐసీ బ్యాంక్ టెక్సాస్‌లోని డల్లాస్ శివారు ఫ్రిస్కోలో కొత్త శాఖను ప్రారంభించింది. చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఈ శాఖను ప్రారంభించారు. కాలిఫోర్నియా వెలుపల ఈ అనుబంధ సంస్థకు ఇదే మొదటి కార్యాలయం కావడం విశేషం. దీనితో అమెరికాలో ఎస్బీఐసీ శాఖల సంఖ్య ఏడు నుండి ఎనిమిదికి పెరిగింది.
టెక్సాస్‌లో ఎస్బీఐసీ బ్యాంక్ కొత్త శాఖ ప్రారంభం
Source: telugutimes.net