వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉండటంతో, ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరంలో రెండు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ప్రజలు, ముఖ్యంగా రైతులు చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.
ఏపీలో భారీ వర్షాలకు APSDMA హెచ్చరిక
Source: Vaartha