కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో రైల్వే ఆహార నాణ్యతపై వస్తున్న విమర్శలపై స్పందించారు. సంవత్సరానికి సగటున 58 కోట్ల మీల్స్ అందిస్తుండగా, నాణ్యతపై ఫిర్యాదులు కేవలం 0.0008 శాతం మాత్రమేనని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన క్యాటరింగ్ కాంట్రాక్టర్లకు రూ. 5.13 కోట్ల జరిమానా విధించినట్లు, ఆరు కాంట్రాక్టులను రద్దు చేసినట్లు వెల్లడించారు. బేస్ కిచెన్లలో సీసీటీవీ, ఫుడ్ ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ల ద్వారా పారదర్శకత పెంచుతున్నామని పేర్కొన్నారు.
రైల్వే ఆహార నాణ్యతపై మంత్రి స్పందన
Source: Vaartha