ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, లేకపోతే ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను నమ్మే ప్రమాదముందని హెచ్చరించారు. మంగళగిరిలో జరిగిన టీడీపీ నేతల శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ, DSC నియామక ప్రక్రియపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వాస్తవాలు వివరించడం వల్లే ప్రజలు వాటిని తిప్పికొడుతున్నారని పేర్కొన్నారు.
తప్పుడు ప్రచారాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చంద్రబాబు
Source: Vaartha